Advertisement

Inspiring Story of Ongole Street Food Vendor || Horlicks&Boost cake || Ongole Street food

Inspiring Story of  Ongole Street Food Vendor || Horlicks&Boost cake || Ongole Street food అడ్రస్:-గాంధీ రోడ్ ...ప్రకాశం పంతులు గారి విగ్రహం వద్ద..
సుమారుగా 57ఏళ్ల క్రితం ఒంగోలుకు చెందిన అచ్యుత బ్రహ్మనందచారి గారు..జీవనోపాధికై స్వతహాగా చిన్నపాటి వ్యాపారం ప్రారంభింద్దామని సంకల్పించారు ...కుటుంబ పోషణ వెసులుబాటుకై పగలంతా శ్రమించిన సాయంత్రం ఇంటికి చేరే సమయానికి నాలుగు రూపాయిలు చేతిలో వుండే విధంగా
తన దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తంతో అల్పాహార బండి ఏర్పాటుకై మొగ్గుచూపారు...
వైవిధ్యం గా ఆలోచించి.. హార్లిక్స్-బూస్ట్ లను మిళితం చేసి ఎగ్ వినియోగించకుండా కేక్స్ తయారీ కై శ్రీకారం చుట్టారు..తొలుతగా ఇంట్లో తయారు చేసి సఫలీకృతులయ్యారు అచ్యుత చారి గారు...వెంటనే చిన్నపాటి బండిని ఏర్పాటు చేసుకుని ఒంగోలు వాసులకు రుచికరమైన,వేడి,వేడి కేక్ లను అందించసాగి మంచి పేరు గడించారు.. ఆ తదుపరి వారి కుమారుడు వెంకటకృష్ణ చారి గారు తండ్రి బాటలో పయనించారు..వీరి కేక్ గురించి తెలుసుకున్న హార్లిక్స్ సంస్థ ఎండీ మిల్వన్ గారు తిరుపతి కి వచ్చిన తరుణంలో నాడు అక్కడ బండి నిర్వహిస్తుండ గా స్వయంగా బండి వద్దకు వచ్చి అభినందించి వెంకట కృష్ణ చారి గారికి హార్లిక్స్ సంస్థలో ఉద్యోగం కల్పించి హార్లిక్స్ కేక్స్ తయారీ విధానం ప్రజలకు తెలిపే బాధ్యతలు అప్పగించారు..ప్రస్తుతం వెంకట కృష్ణచారి గారి కుమారుడు అచ్యుత చారి గారు ఒంగోలు బండి నిర్వహిస్తున్నారు..ఓ బ్యాంక్ లో క్లార్క్ గా పని చేస్తున్న అచ్యుత చారి గారు...వారి తాత,నాన్న గారి బాటలో పయనించాలని ,అలానే ఇన్నాళ్లు తమ కుటుంబానికి ఉపాధి చూపిన ఈ రంగాన్ని వదలకుండా కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు..

hyderabad street food,amazing indian food,indian street food,inspirational story,motivational story,Success Story of a Street Food,food story,best food,street food hyderabad,street food india,best street food in hyderabad,ongolestreetfood,ongolenews,Robohotel,cakes,

Post a Comment

0 Comments